విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణములో వివిధ సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు నేడు పేదలకు వరంలాగా మారుతుండడంతో చక్కటి ఆరోగ్యాన్ని పొందుతున్నారని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆరోగ్య లబ్ధిదారులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో 119వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి సంఘం కమిటీతోపాటు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 119 శిబిరాలను దాతల సహాయ సహకారములతో నిర్వహించడం మాకెంతో సంతృప్తిని ఇస్తోందని తెలిపారు. నేటి శిబిర దాతలుగా కీర్తిశేషులు దాసరి కేశమ్మ కీర్తిశేషులు దాసరి పెద్ద వెంకటేశులు జ్ఞాపకార్థం కుమారులు దాసరి రమాదేవి దాసరి వెంకటేశులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ శిబిరంలో నిష్ణాతులైన వైద్యులు డాక్టర్ వివేక్ కుల్లాయప్ప, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ జయదీపునేత ,డాక్టర్ విట్టల్ ,డాక్టర్ సుబ్రహ్మణ్యం వారు రోగులకు వైద్య చికిత్సలను అందించి ఆరోగ్య సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆసుపత్రి శిబిరం;; పట్టణములోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శాస్త్ర చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు లైన్స్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి వెంకటేష్ కుమారులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి మనిషికి అతి ముఖ్యమైన కంటి విభాగమును ఉచితంగా ఆపరేషన్తో పాటు ఉచితంగా అద్దాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరాలు కేవలం నిరుపేదలకు మాత్రమే కంటిచూపులు ప్రసాదించడం జరుగుతోందని తెలిపారు. నిపుణులైన లయన్స్ కంటి ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ బృందంచే ఆపరేషన్లు నిర్వహించబడునని తెలిపారు. బీపీ షుగర్ ఉన్న రోగులు, పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో లేజర్ చికిత్స కలదని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


