Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాహెల్మెట్ ప్రయాణం సురక్షితం

హెల్మెట్ ప్రయాణం సురక్షితం

- Advertisement -


కలెక్టర్ జి లక్ష్మీశ

విశాలాంధ్రవిజయవాడ:ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా, పోలీసు శాఖల అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుండి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలలో హెల్మెట్ ధరించి వాహనాలను నడపడం పై పూర్తి అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలలో చైతన్యం పెరిగి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఎంతగానో రాణిస్తున్నారన్నారు. దైనందిక జీవితంలో మహిళలు అవసరాలకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే మహిళల సంఖ్య నానాటికి పెరుగుతున్న తరుణంలో హెల్మెట్ ధరించడంపై మహిళలకు అవగాహన కల్పించి చైతన్య వంతులను చేయడం ఎంతో అవసరమన్నారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం వాహనాలు నిర్లక్ష్యంగా నడవడం, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడం వలన జరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. డీసీపీ ఎస్ కె హసీనా బేగం మాట్లాడుతూ కార్లు ద్విచక్ర వాహనాలు నడిపే వాహన చోదకులు సీటు బెల్టు హెల్మెట్ తప్పక ధరించి వాహనాలను నడపాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
మహిళా బైక్ హెల్మెట్ ర్యాలీ లో ఎసిపి వంశీధర్ గౌడ్, ఆర్టీఓలు ఆర్ ప్రవీణ్, కె. వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎండి అలీ, కె. శివరాం గౌడ్, ఎ.ఉదయ్ శివప్రసాద్, సిహెచ్ గీతాంజలి కెబిఎన్ కళాశాల ఏవో నారాయణ రావు, పలువురు మహిళాలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు