Homeజిల్లాలుఅనంతపురంరాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడు నారా లోకేష్

రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడు నారా లోకేష్

- Advertisement -

ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిచార శ్రీరామ్

విశాలాంధ్ర – ధర్మవరం; రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడు నారా లోకేష్ అని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా నారా లోకేష్ పై విశ్వాసంతో ఉన్నారు అని ధర్మవరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. ధర్మవరంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. ముందుగా నారా లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ పట్టణంలోని దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి కార్యాలయం వద్ద పేదలకు ఉచిత అల్పాహార విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున వేడుకలు జరిగాయి. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు,పండ్లు పంపిణీ చేశారు. ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న అన్న క్యాంటీన్ వద్ద పరిటాల శ్రీరామ్ పేదల మధ్య లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, పేదలకు అన్నదానం చేశారు. అలాగే రెండు అన్న క్యాంటీన్లలో పేదలకు మిఠాయిలు పంచడంతో పాటు అన్నదానం చేశారు. తదుపరి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఒక నాయకుని జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఇంత ఘనంగా జరుపుకుంటున్నారంటే ఆయన జనంలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారన్నది అర్థమవుతోందన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా టిడిపిని అధికారంలోకి తీసుకురావడంలో చాలా కీలకపాత్ర పోషించారని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ పాత్ర ఎంతో ఉందన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని.. ఆయనతో పాటు కలిసి నడవడానికి రాష్ట్రంలో యువత అంతా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ జూనియర్ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు