Sunday, November 16, 2025
Homeజిల్లాలుప్రకాశంస్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వామ్యం కావాలి

స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్రలో భాగస్వామ్యం కావాలి

- Advertisement -

విశాలాంధ్ర – వెలిగండ్ల: స్వర్ణాంధ్ర స్వచ్ఛందరలో ప్రజల భాగస్వాములు కావాలని ఎంపీడీవో షేక్ మహబూబ్ బాషా అన్నారు. శనివారం మండలంలోని వెలిగండ్ల, మరపగుంట్ల పంచాయతీ బస్టాండ్ సెంటర్ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర పై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి షేక్ మహబూబ్ బాషా, డిప్యూటీ ఎంపీడీవో ఒంగోలు అన్నమ్మ,టిడిపి మండల అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పరిసరాలు శుభ్రంగా ఉండేవిధంగా చూసుకోవాలన్నారు ప్రతి గ్రామపంచాయతీ పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు ప్రతి షాపు యజమాని ప్లాస్టిక్ అమ్మకాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు ప్లాస్టిక్ వలన ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని దశలవారీగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలన్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులని ఘనంగా సన్మానించారు ఈ క్రమంలో స్వర్ణద్ర -స్వచ్ఛ ఆంధ్రపై ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సై కృష్ణ పావని, డిటి శ్రీనివాసరావు, ఎంఈఓ దాస్ ప్రసాద్, ఏపీఓ శ్రీనివాస నాయక్ సచివాలయ సిబ్బంది స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ అన్నపురెడ్డి కృష్ణారెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు