విశాలాంధ్ర – వెలిగండ్ల: పేదలకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా వైయస్సార్ పార్టీ ఉపాధ్యక్షులు జిల్లా జడ్పిటిసి సంఘం అధ్యక్షులు వెలిగండ్ల జడ్పిటిసి గుంటక తిరపతి రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని గుడిపాటి పల్లెలో మెడికల్ కాలేజీ ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గోడ పత్రికను మండల కన్వీనర్ గజ్జల వెంకటరెడ్డి అధ్యక్షతన ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి పేదలకు వైద్య విద్యను అందించాలని లక్ష్యంగా ఏర్పాటు చేస్తే ఓటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ లను పిపిపి విధానంలో కి తీసుకువచ్చి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు పుట్టెల ప్రయత్నం చేస్తున్నాయని రాష్ట్రంలో కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు మెరుగైన సేవలందించి అక్కడ పడిన ఇబ్బందులను గుర్తించిన జగన్ అన్న అన్ని జిల్లాలలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఉండాలి ప్రతి గ్రామంలో విద్యార్థులు వైద్య విద్యను చదవాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తే నేటి కూటమి ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కి జగనన్న ఏమి చేయలేదని ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు ఈ క్రమంలో గుడిపాటిపల్లిలోని ప్రతి ఇంటిని సందర్శించి వారికి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కాకర వెంకటేశ్వర్లు, కటికల అశోక్ కుమార్ ఓసూరి ముసలయ్య సానికొమ్ము మాలకొండ రెడ్డి నల్లబోతుల చెన్న కృష్ణయ్య చిలకల నారాయణరెడ్డి సర్పంచ్ తాతపూడి సురేష్ నాని గంజి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


