విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు సామగ్రి (పటాకులు, క్రాకర్స్) అమ్మకం మరియు నిల్వపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని రాజాం పట్టణ ఇన్స్పెక్టర్ కె. అశోక్ కుమార్ తెలిపారు.ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రామాలలో, వీధుల్లో, కాలనీలలో, మంచములపై, బెంచీలపై, దుకాణాలలో, బడ్డీలలో, తోపుడు బండ్లలో, ఆటోలలో పటాకులు అమ్మడం పూర్తిగా నిషేధమని ఆయన హెచ్చరించారు. ఇటువంటి అనధికారిక విక్రయాలు చేస్తే వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి పటాకుల సామగ్రిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.అలాగే, ఎక్కువ మోతాదులో పటాకులను ఇంట్లోనైనా, వ్యక్తిగత స్థలాల్లోనైనా నిల్వ ఉంచడం కూడా చట్ట విరుద్ధమేనని గుర్తు చేశారు. ప్రభుత్వం అనుమతించిన గోదాముల్లో తప్ప ఎక్కడా నిల్వ చేయరాదని స్పష్టం చేశారు.ప్రజలంతా జాగ్రత్తగా ఉండి, ఎటువంటి ప్రమాదాలకు తావు లేకుండా ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.“మీ భద్రతే మా లక్ష్యం” అని ఇన్స్పెక్టర్ కె.అశోక్ కుమార్ తెలిపారు.


