Homeజిల్లాలుఅనంతపురంగూగుడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం

గూగుడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలు విజయవంతం

- Advertisement -

ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు

విశాలాంధ్ర–నార్పల: గూగూడు కుళ్ళాయి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల నడుమ విజయవంతంగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్సై సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.బ్రహ్మోత్సవాల ప్రారంభంలో నిర్వహించిన మొదటి సరిగెత్తు నుంచి చివరి జలధి కార్యక్రమం వరకు ప్రతి దశలోనూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ఎస్సై సాగర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ నిర్వహణ, భద్రతా చర్యలను సమర్థంగా అమలు చేయడంతో భక్తులు ఎలాంటి ఆటంకం లేకుండా స్వామివారిని దర్శించుకున్నారు.ఉత్సవాలన్నీ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్సై సాగర్, పోలీసు సిబ్బందికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి.ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ, ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో మొదటి సరిగెత్తు నుంచి చివరి జలధి వరకు పోలీసుల సమర్థ నిర్వహణ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, ముఖ్యంగా ఎస్సై సాగర్ నాయకత్వంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు అభినందనీయమని ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు