…ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా) డిమాండ్..
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : తెలంగాణా హై కోర్టు బార్ మెంబెర్ న్యాయవాది సురేష్ బాబు పై ఒక రౌడీ షీటర్ అమానుషంగా జరిపిన దాడిని ” ఆలా ” తీవ్రంగా ఖండిస్తుంది అని ఆలా అధ్యక్షులు ఎమ్ వి రాజారామ్, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుద్ద ప్రాతిపదికన న్యాయవాదులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన రీతిలో ” అడ్వకేట్ ప్రొటెక్షన్ యక్ట్ ” ను తక్షణమే అమలు చేయాలి అని, న్యాయవాదులపై జరిగే దాడు లను ముందస్తుగా పసిఘట్టే విధంగా ప్రత్యేక ” నిఘా ” సంస్థలను నియమించాలని . న్యాయవాదులకు భద్రత కరువైతే ఆటవిక వ్యవస్థ రాజ్యమేలుతుందని ప్రభుత్వాలు గ్రహించాలని, న్యాయవాదులను కాపాడుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేయాలన్నారు. అలాగే 10 సం.రా.లు. దాటిన న్యాయవాదులను కోర్టు ఆఫీసర్స్ గా గుర్తిస్తు తక్షణమే చట్టం చేయాలని, న్యాయవాదులపై జరిగే దాడులకు సంబందించి ముద్దాయిల పై ఐ పి సి 353 , 332 వంటి ఇతర చట్టాలు అమలు కాబడే విధంగా ప్రస్తుత చట్టాలను అమలు చేయాలని, దాడులకు సంబందించి ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా కాలయాపన లేని తీర్పులను అమలు పరచి న్యాయవాదుల ఆత్మవిశ్వాసానికి ప్రభుత్వాలు బాసటగా నిలవాలన్నారు. న్యాయవాది సురేష్ బాబు పై జరిగిన దాడి పట్ల తెలంగాణా సర్కార్ కఠినంగా వ్యవహరించాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడుల పట్ల ” ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ” తీవ్రంగా పరిగణిస్తుందన్నారు . ఇప్పటికే ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, లా కమిషన్ ఆఫ్ ఇండియా కు ” ఆలా ” తరుపున న్యాయవాదుల భద్రతకు ” అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యక్ట్ ” తక్షణమే అమలు చేయమని అనేక వినతి పత్రాలు సమర్పించటం జరిగిందన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణా అడ్వకేట్స్ తో సంప్రదించి న్యాయవాదుల భద్రతపై సంయుక్త కార్యాచరణకు వ్యూహ రచన చేస్తున్నట్టు వారు తెలిపారు ..


