Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా గురుపూజోత్సవం వేడుకలు

ఘనంగా గురుపూజోత్సవం వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని నూతన ఆర్యవైశ్య సత్రం నందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ గురు పూజోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీరే వంశీకృష్ణ, కరస్పాండెంట్ వంశీకృష్ణ నోబెల్ స్కూల్, ప్రధానవక్తగా కత్తి రామచంద్రారెడ్డి, విభాగ కార్యకారిణి సభ్యులు హాజరు కావడం జరిగింది. అనంతరం కత్తి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంలో కాషాయ ధ్వజాన్ని గురువుగా స్వీకరించడం జరిగింది అని, వ్యక్తులను గౌరవించడం జరుగుతుంది పని తెలిపారు. అంతేకానీ వ్యక్తినిష్ట జరగదు అని స్పష్టం చేశారు. సంఘం ప్రారంభించబడి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సామాజిక సమరసత, కుటుంబ ప్రభోధన్, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు, స్వదేశీ స్వావలంబన ఈ ఒక సమాజం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగ్ బౌద్దిక్ ప్రముఖ్ శింగనమల శివకిషోర్, వివేకానంద,జిల్లా సహా కార్య వాహ్ సీకే శరత్, ఉపాధ్యాయ ప్రముఖ్ అన్నం అరవింద్,పి. నరసింహ, రెడ్డప్ప మొదలైన స్వయం సేవకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు