పూజారి రాజా స్వామి, భక్తాదులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని రైల్వే కాలనీ కొత్తపేటలో గల శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయములో గురు పూర్ణిమ మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభించడం జరిగిందని పూజారి రాజా స్వామి, భక్తాదులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలు ఈనెల ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు ఐదు రోజులు పాటు భక్తాదుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. మొదటి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలను, అర్చనలను నిర్వహించడం జరిగిందన్నారు. తదుపరి సత్యనారాయణ స్వామి వ్రతమును మహిళల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో నిర్వహించామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అదేవిధంగా ఈనెల 10వ తేదీన సాయి రక్తదాన శిబిరమును కూడా ఏర్పాటు చేస్తున్నామని రక్త దాతలు ముందుకు వచ్చి రక్తాన్ని ఇచ్చి ప్రాణదాతలుగా కావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమములో అధిక సంఖ్యలో భక్తాదులు, మహిళలు పాల్గొన్నారు.
ప్రారంభమైన గురు పూర్ణిమ మహోత్సవ వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


