విజృంభిస్తోన్న ఎబోలా వైరస్
ఉగాండా: ఆఫ్రికాలోని కాంగోలో ‘ఎబోలా’ వైరస్ విజృంభిస్తోంది. అక్కడ ఈ ప్రాణాంతక వ్యాధి సోకి ఇప్పటికే 88 మంది మృతి చెందారు. మరో 300 మందకిపైగా ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న ఉగాండాలోనూ ఈ వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనితో కాంగో, ఉగాండాలో ఆరోగ్య అత్యవసర స్థితిని విధిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచఓ) ప్రకటించింది. కాంగో పొరుగు దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాంగోలో 1976 నుంచి ఈ వ్యాధి కనిపిస్తోంది. జాతీయ విపత్తు యంత్రాంగాలను క్రియాశీలకం చేయాలని, సరిహద్దు వెంబడి స్త్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూటీఓ సూచింది. మరో పక్క కాంగో, ఉగాండాలో ఈ వ్యాధి సోకిన వారు ఇతర దేశాలకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. దీనితో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.
వ్యాధి లక్షణాలు…
ఎబోలా (ఈవీడీ) ప్రాణాంతక వ్యాధి. వ్యాధి పట్ల చాలా అప్రమత్తత అవసరం. వైరస్ సోకిన 2 నుంచి 21 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు హఠాత్తుగా కినిపిస్తాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు…జ్వరం, తీవ్రమైన అలసట, కండరాల నొప్ప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, అంతర్గత, బాహ్య రక్తస్రావం. ప్రారంభంలో అలసట, తలనొప్పి, గొంతు నొప్పి, అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తరువాత వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, చర్మంపై దద్దుర్లు వస్తాయి. అనంతరం రక్తస్రావం (చిగుళ్లు, కళ్లు, ముక్కు, మలం లేదా వాంతుల్లో రక్తం), కాలేయం, ముత్రపిండాల పనితీరు దెబ్బతినడం జరుగుతుంది. ముదిరిన కొద్దీ నరాల సంబంధిత ýక్షణాలు బయటపడతాయి. గందరగోళం, చిరాకు, దూకుడు, మÖర్చ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. వేరే వ్యక్తులకు సోకే ప్రమాదం ఉంది కాబట్టి క్వారంటైన్ పాటించడం మంచిది. రోగులకు ద్రవ పదార్థాలు అందించాలి. వెంటనే చికిత్సలు నిర్వహిస్తే మరణాల రేటు తగ్గించవచ్చు.
కాంగో, ఉగాండాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి
- Advertisement -


