Homeఆంధ్రప్రదేశ్ఈ 126 పశువులను పోషించలేను

ఈ 126 పశువులను పోషించలేను

- Advertisement -

కలెక్టర్ గారు మీరే తీసుకుని గోశాలకు అప్పగించేయండి

ఓ వృద్ధ రైతు వేడుకోలు

విశాలాంధ్ర రైల్వేకోడూరు: ఈ పశువులను పోషించలేను….మీరే తీసుకోండి అంటూ ఓ వృద్ధ రైతు తన ఆవేదనను మీడియా ముందు ఆవేదన చెందడం అందరినీ కలిచివేసింది. నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లి మండలంలోని కొర్లకుంట చలంపాలెం మధ్యలో చిత్తూరు జిల్లా కానిపాకం కు చెందిన విజయ్ కుమార్ (70)అనే వ్యక్తి పద్మావతి అనే పేరుతో గోశాలను నడుపుతున్నారు.గత 26 సంవత్సరాలుగా గోశాలను నడుపుతున్నారు. వయోభారంతో అనారోగ్యంతో వృద్దాప్యంలో 126 ఆవులను,లేగ దూడలను సంరక్షించలేక పోతున్నానని శుక్రవారం పాత్రికేయుల ఎదుట వాపోయాడు.గోవులను పోషించడం ఇష్టం వలన నాడు పద్మావతి గోశాలను ఏర్పాటు చేసి గోవులను పోషిస్తూ వచ్చాను.ప్రస్తుతం వయో భారంతో గోశాలను నడపలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 126 గోవులను, లేగదూడలను అన్నింటినీ టిటిడి గోశాలకు తరలించి న్యాయం చేయాలని విజయ్ కుమార్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు