విశాలాంధ్ర పుట్టపర్తి: – రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు తలెత్తితే యూనియన్ దృష్టికి తీసుకురావాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, పాలెల రామాంజనేయులు యాదవ్ లు పేర్కొన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కు 2019 ఆగస్టు 16వ తేదీన గుర్తింపు వచ్చిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ , ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ ఆదేశాలతో జిల్లా కేంద్రమైన పుట్టపర్తి జిల్లా కార్యాలయం లో జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నేటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు వచ్చి ఆరు సంవత్సరాల పూర్తయ్యిందని ఈ ఆరు సంవత్సరాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూనియన్ తరపున అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించడం జరిగిందన్నారు.నాలుగో తరగతి ఉద్యోగి నుండి గ్రూప్ వన్ అధికారుల వరకు అన్ని కేడర్ల ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లో కొనసాగుతున్నారన్నారు .ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తిన యూనియన్ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తున్నామని జిల్లా అధ్యక్షులు హామీ ఇచ్చారు.యూనియన్ గుర్తింపు దినోత్సవాన్ని పురస్కరించుకొని “రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం” కార్యక్రమాన్ని విజయవంతం చేయడం యొక్క అవశ్యకతను కార్యదర్శి రామాంజనేయులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోవిందప్ప, రవి , ముసలి రెడ్డి,సహా కార్యదర్శి కిషోర్, వివిధ తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలు ఉంటే యూనియన్ దృష్టికి తీసుకురావాలి
- Advertisement -
RELATED ARTICLES


