పుట్టపర్తి..విశాలాంధ్ర:- స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు ఉద్యమ కారకుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ పేర్కొన్నారు.శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమం, జమీందారీ వ్యతిరేక పోరాటం, హరిజన సేవ, మద్యపాన నిషేధం వంటి రంగాల్లో లచ్చన్న చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.సమాజంలోని పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై ఆయన జీవితాంతం శ్రమించారని గుర్తుచేశారు. ఆయన చూపిన ఆత్మీయత, త్యాగం, పోరాటస్ఫూర్తిని యువత తమ జీవితాలలో ఆచరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.సర్దార్ గౌతు లచ్చన్న 1909 ఆగస్టు 16న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామంలో చిట్టయ్య, రాజమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే సామాజిక చైతన్యం కలిగి స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇతర ప్రధాన పోరాటాలలో పాల్గొన్నాడు. అతను బెర్హంపూర్, రాజమండ్రి జైళ్లలో కఠిన కారాగారవాసంతో పాటు అనేక సార్లు జైలు జీవితం అనుభవించాడు. అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. గిరిజన, రైతు, కూలీల హక్కుల కోసం నిరంతర పోరాటం చేసిన యోధుడు అని తెలిపారు.సర్దార్ గౌతు లచ్చన్న 2006 ఏప్రిల్ 19న కన్నుమూశారు. కానీ ఆయన చూపిన మార్గం, చేసిన త్యాగం, సాధించిన విజయాలు ఈ రోజు కూడా సమాజానికి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయని ..ఆయన చూపిన మార్గంలో విద్యార్థులు, యువత అనుసరిస్తు సమాజ శ్రేయస్సు కు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా రివెన్యూ అధికారి సూర్యనారాయణ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి, ఏపీఎంఐపీ పీడి సుదర్శన్, సమాచార శాఖ సహాయ సంచాలకులు వేణుగోపాల్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ గౌతు లచ్చన్న జీవితం స్ఫూర్తిదాయకం.జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్
- Advertisement -
RELATED ARTICLES


