విశాలాంధ్ర పుట్టపర్తి :- గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని జగరాజు పల్లి లో ప్రభాస్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో సంస్థ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి మనిషికి నేత్రాలు ఎంతో ముఖ్యమైనవి అన్నారు. మనిషికి కళ్ళు లేకపోతే జీవితమంతా అంధకారమే అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం బిజిగా గడుపుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ గడుపుతున్న ప్రజలకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో దోహదపడతాయన్నారు. బెంగళూరుకు చెందిన మంజునాథ నేత్రాలయం వారి సహకారంతో ఈరోజు జగరాజుపల్లికి చెందిన ప్రభాస్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు అనిల్ కుమార్ ,సికిందర్ తోపాటు మరికొంత మంది వైద్య బృందం సుమారు 127 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇలాంటి ఆరోగ్య వైద్య శిబిరాలు అందించేందుకు యువత ముందుకు రావాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం సంస్థ ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ కంటి ఉచిత వైద్య శిబిరానికి 127 మంది హాజరయ్యారని, వీరిలో 37 మందికి కంటి వైద్య చికిత్సలు అవసరమని గుర్తించి వీరిని చికిత్స నిమిత్తం బెంగళూరులోని మంజునాథ నేత్రాలయ ఆసుపత్రికి పంపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీగా తరలి వచ్చి సహాయ సహకారాలు అందించిన గ్రామస్తులకు,స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజునాథ నేత్రాలయ వైద్యులు మరియు స్కాట్లాండ్ , దక్షిణాఫ్రికాకు చెందిన అంగీలా డిక్సన్ , లలిత అనూఫ్ ,రేఖ, జగరాజుపల్లికి చెందిన టిడిపి నాయకులు మురళి ధర్ రెడ్డి, కూటమి పార్టీల నాయకులు కన్వీనర్ విజయ్ కుమార్, శ్రీరామ్ రెడ్డి ,బొమ్మయ్య ,శ్రీరాం నాయక్, స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు అభినందనీయం..మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES


