Homeజిల్లాలుకర్నూలుఅక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

- Advertisement -

రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఐ మారుతి

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలో ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు పెద్దకడబూరు పోలీసులు శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఏపీ 39 డబ్ల్యు ఎల్ 1979 నంబర్ గల ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 7 క్వింటాళ్లు బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మారుతి తెలిపారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఎరుకల వీరేంద్ర వివిధ గ్రామాల నుంచి బియ్యాన్ని సేకరించి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం లేదా తరలించడం చట్ట విరుద్ధమన్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు