Tuesday, July 15, 2025
Homeఆంధ్రప్రదేశ్కృష్ణాకు పెరుగుతున్న వరద ప్రవాహం ..జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి లక్షా 20వేల క్యూసెక్కుల వరద

కృష్ణాకు పెరుగుతున్న వరద ప్రవాహం ..జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి లక్షా 20వేల క్యూసెక్కుల వరద

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు 67 వేల క్యూసెక్కుల నీరు
శ్రీశైలంలో ప్రస్తుత నీటి మట్టం 873.90 అడుగులు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం అధికమైంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1 లక్షా 20 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుకుంటోంది. శ్రీశైలం నుంచి 67 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35 వేల క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31 వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం గరిష్ఠ స్థాయి 885 అడుగులు కాగా, ప్రస్తుతం 873.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 172.66 టీఎంసీలకు చేరుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు