Tuesday, July 15, 2025
Homeసినిమాతమ్ముడు సినిమా ప్రమోషన్లలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన నటి లయ

తమ్ముడు సినిమా ప్రమోషన్లలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన నటి లయ

స్వయంవరం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటి లయ, తనలో దాగి ఉన్న మరో అద్భుతమైన ప్రతిభను బయటపెట్టారు. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, ఏకంగా ఏడుసార్లు రాష్ట్రస్థాయి చదరంగం ఛాంపియన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే నితిన్ హీరోగా నటించిన ఃతమ్ముడుః చిత్రంతో సినిమాల్లోకి పునరాగమనం చేసిన లయ, ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన చిన్ననాటి విశేషాలను పంచుకున్నారు.తాను రెండో తరగతి నుంచే చదరంగం ఆడటం ప్రారంభించానని లయ తెలిపారు. పట్టుదలతో సాధన చేసి ఏడుసార్లు రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవడమే కాకుండా, జాతీయ స్థాయిలో పతకాన్ని కూడా కైవసం చేసుకున్నానని గుర్తుచేసుకున్నారు. అయితే, పదో తరగతి తర్వాత చదువుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో గంటల తరబడి సాగే కోచింగ్‌కు వెళ్లలేక చదరంగానికి దూరమవ్వాల్సి వచ్చిందని ఆమె వివరించారు.

నటన, చదువును ఏకకాలంలో సమన్వయం చేసుకోవడంలో తన ప్రతిభను లయ మరోసారి నిరూపించుకున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలోనే ఃస్వయంవరంః సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, ఎంసెట్ పరీక్షలో 13,126 ర్యాంక్ సాధించింది. అయితే, ఇంజినీరింగ్ కాలేజీలో చేరాక సీనియర్లు తన ర్యాంకును చూసి ఁలారీ నంబర్ఁ అంటూ సరదాగా ఆటపట్టించేవారని ఆమె నవ్వుతూ చెప్పారు.

పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన లయ, ఃతమ్ముడుః చిత్రంతో విజయవంతంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మూడు నంది అవార్డులు అందుకున్న నటిగా రికార్డు సృష్టించిన లయ, ఇప్పుడు తనలోని ఈ కొత్త కోణాన్ని పరిచయం చేసి అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు