Homeజిల్లాలుఅనంతపురంఉరవకొండలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఉరవకొండలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉరవకొండ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు గన్నే మల్లేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సూరి, తాలూకా నాయకులు సుల్తాన్, హసేన్ భాష, బసవరాజు, మహిళా సమాఖ్య నాయకులు నూర్జహాన్, వన్నూరమ్మ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సమీపంలో తోపుడు బండ్ల యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. యూనియన్ నాయకులు చక్రధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, నాయకులు గంగాధర్, చెన్నారాయుడు, వీరితోపాటు సీపీఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అరుణ, ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ నరసింహులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు