నేడు ఇంగ్లాండ్‌తో భారత్ మూడో టీ20
ఉత్కంఠతో ఎదురు చూస్తున్న భారత అభిమానులు
క్రీడలు: భారత టీ 20 జట్టు అనూహ్యంగా వరుస పరాజయాలను మూటగట్టుకుంది. ఐర్లాండ్‌తో అక్కడ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విఫలం చెందింది. ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన రెండింటిలో ఒకటి రద్దు కాగా మరో మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. శ్రేయస్ అయ్యర్ టీ20 జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాక వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదో మ్యాచ్‌లో అయినా ఖాతా తెరుస్తాడేమో అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్ల సిరీస్‌లో 0-1తో వెనుకబడిన టీమ్ఇండియా… మంగళవారం (నేడు) మూడో టీ20 ఆడబోతోంది. రెండో టీ20లో రవి బిష్ణోయ్ పేలవ ప్రదర్శన భారత్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఏమాత్రం లెంగ్తను దొరకబుచ్చుకోలేకపోయిన ఈ లెగ్స్పిన్నర్…4 ఓవర్లలో వికెట్ తీయకుండా భారీగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో నాటింగ్హామ్లో జరిగే మూడో టీ20లో బిష్ణోయ్ తుది జట్టులో ఉండే అవకాశం లేదు. మూడో పేసర్‌గా ప్రిన్స్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. అర్üదీప్‌తో కలిసి హర్షిత్ రాణా బౌలింగ్ దాడిని ఆరంభిస్తాడు. రెండో టీ20లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన బెతెల్ను మంగళవారం టీమ్ఇండియా బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి. బ్యాటింగ్‌లో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఎలాంటి ఆరంభం ఇస్తారనేది ఆసక్తికరం. గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన వైభవ్…14 పరుగులకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో అతను పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. శ్రేయస్, ఇషాన్, తిలక్ పెద్ద ఇన్నింగ్స్లు ఆడాల్సి ఉంది. ట్రెంట్ బ్రిడ్¨ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. మైదానంలో చిన్న బౌండరీలు ఉండడంతో సిక్స్ల మోత మోగొచ్చు. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. నాటింగ్హామ్ లో రాత్రి 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్తకంఠగా ఎదురు చూస్తున్నారు. ఒత్తిడంతా భారత్‌పైనే ఉందని చెప్పక తప్పదు. భారత ఆటగాళ్లు ఒత్తిడి తట్టుకుని ఏ మేరకు నిలదొక్కుకుంటారనేదానిపై ఫలితం ఉంటుంది.
ఈ రోజైనా…గెలుస్తారా!
- Advertisement -


