అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ వెల్లడి
న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి విపక్షాలతో చర్చించేందుకు బుధవారం సాయంత్రం పార్లమెంటు సముదాయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించదని స్పష్టం సంబంధిత వార్గాలు తెలియజేశాయి. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్తల్ని తోసిపుచ్చుతూ… మనది పాకిస్థాన్‌లాంటి దళారీ దేశం కాదని కేంద్ర సర్కారు వ్యాఖ్యానించింది. 1981 నుంచి పాకిస్థాన్‌ను అమెరికా వాడుకుంటోందని, అందువల్ల మధ్యవర్తిత్వ ప్రయత్నాలను పాక్ చేయడంలో ఎలాంటి కొత్తదనం లేదని తేల్చిచెప్పింది. అన్ని వర్గాలనూ బాధిస్తున్న యుద్ధాన్ని సత్వరం ముగించాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారని ప్రభుత్వం ఈ సమావేశ వేదికగా వెల్లడించింది.
ఇరాన్‌పై దాడి విషయంలో స్పందిస్తూ వస్తున్నాం…
ఇరాన్ సుప్రీం ఖామేనీని హతమార్చడంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని మంత్రులు తోసిపుచ్చారు. ప్రభుత్వం ఎప్పటికప్ప్పుడు స్పందిస్తోందని స్పష్టం చేశారు. ‘ఇరాన్ దౌత్య కార్యాలయం తెరచుకోగానే మన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వెంటనే వెళ్లి అక్కడి సంతాపాల పుస్తకంలో సంతకం చేశారని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయుల భద్రతకు, దేశీయ ఇంధన అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోంది. ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, నాలుగు ఇంధన నౌకలు ీVAర్మూజ్ జలసంధిని దాటాయి. మరో ఐదు త్వరలో దాటనున్నాయి. ఇంకో 18 నౌకలు అక్కడికి సమీపంలో నిలిచి ఉన్నాయి’ అని కేంద్రమంత్రులు వివరించారు. శ్రీలంక జలాల్లో ఇరాన్ నౌకపై అమెరికా దాడిచేసి ముంచేయడాన్ని మంత్రులు ప్రస్తావిస్తూ- ఆ నౌక మన జలాల్లో ఉంటే కాపాడేవాళ్లమని చెప్పారు. ఇరాన్‌కు చెందిన ఇతర నౌకల్ని, సిబ్బందిని మనం కాపాడటంపై ఆ దేశం కృతజ్ఞతతో ఉందని తెలిపారు. అయితే ప్రభుత్వ వివరణపై విపక్షాలు పెదవి విరిచాయి.


