Homeజిల్లాలువిజయనగరంపారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్న ఇంటర్ పరీక్షలు

పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్న ఇంటర్ పరీక్షలు

- Advertisement -

జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి
విశాలాంధ్ర,సీతానగరం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వెల్లడించారు. శనివారంనాడు మండలంలోని జోగింపేటలో స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పరీక్షా కేంద్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులు, నిబంధనల అమలు తీరును స్వయంగా పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలను జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సిసి కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని,ఇన్విజిలేటర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వేసవిదృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ కిట్లు మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈతనిఖీలో కలెక్టర్ వెంట తహశీల్దార్ ప్రసన్నకుమార్ ,కళాశాల చీఫ్ సూపరింటెండెంటు గొట్టాపు తవిటినాయుడు, డిఓ అల్లాడ రామారావులు పాల్గొన్నారు.
ఇదిలాఉండగా శనివారంనాడు జరిగిన 6వరోజు ఇంటర్మీడియట్  పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రెండు పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు  కొల్లి.శాంతి, గొట్టాపు తవిటినాయుడు, డిపార్ట్మెంటల్ అధికారులు ఎం.రాజేష్, అల్లాడ రామారావులు తెలిపారు.రెండుపరీక్షాకేంద్రాల్లో 144 సెక్షన్ అమలులోఉన్నందున  పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసినట్లు ఎస్సై ఎం.హేమలత,ఏఎస్ఐ లక్ష్మణరావులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు