Homeజిల్లాలుఅనంతపురంగ్రంథాలయాధికారి వీరనారాయణరెడ్డి సేవలు అమోఘం

గ్రంథాలయాధికారి వీరనారాయణరెడ్డి సేవలు అమోఘం

- Advertisement -

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో గ్రేడ్-3 లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న వీర నారాయణరెడ్డి శనివారం తన 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి పి.కమ్మన్న మాట్లాడుతూ 1993లో గ్రంథాలయ శాఖలో ప్రవేశించిన వీరనారాయణ రెడ్డి, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ పాఠకుల మన్ననలు పొందారు.
​ రాప్తాడు గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడంలో ఆయన చూపిన చొరవ ఎనలేనిదన్నారు. రికార్డుల నిర్వహణ, పుస్తకాల సంరక్షణలో ఆయన చూపిన నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమన్నారు. సర్పంచ్ సాకే తిరుపాలు మాట్లాడుతూ గ్రంథాలయం అంటే ఒక విజ్ఞాన భాండాగారమని, అలాంటి గ్రంథాలయాల్లో 33 ఏళ్ల పాటు సేవలు చేయడం అభినందనీయమన్నారు.
​వీరనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు ప్రజలు, విద్యార్థులు చూపిన ఆదరాభిమానాలు మరువలేను. నా వృత్తి జీవితంలో ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిరోహించడం చూసి గర్వపడుతున్నాను. అనంతరం వీరానారాయణ, చంద్రావతి దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు ప్రతాపరెడ్డి, రవికుమార్ నాయుడు, జయరాం, శ్రీనివాసులు, గోవిందు, బాబా, ప్రసాద్, శంకరప్రసాద్, కృష్ణ, ఆర్.ఎస్. రాజు, ఖాజామొహిద్దీన్, రిటైర్డ్ ఉద్యోగులు కృష్ణ, పుల్లన్న, కిష్ట తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు