Homeజిల్లాలుశ్రీకాకుళంజాతీయ సైన్స్ డే సందర్భంగా శ్రీవత్స స్కూల్ ర్యాలీ

జాతీయ సైన్స్ డే సందర్భంగా శ్రీవత్స స్కూల్ ర్యాలీ

- Advertisement -

విశాలాంధ్ర–రాజాం: జాతీయ సైన్స్ డే పురస్కరించుకుని శ్రీవత్స ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని మెయిన్ సెంటర్‌లో ఘనంగా సైన్స్ డే ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన నినాదాలు చేస్తూ ర్యాలీని ఉత్సాహభరితంగా కొనసాగించారు.
సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో చైతన్య వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో శ్రీవత్స స్కూల్ చైర్మన్ శ్రీమతి తులసి రెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు