Homeఆంధ్రప్రదేశ్ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలి : వామ పక్ష పార్టీల, ప్రజా...

ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలి : వామ పక్ష పార్టీల, ప్రజా సంఘాల

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యం లో జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి ,సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి రాముడు అధ్యక్షత వహించగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కే రామాంజనేయులు ,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ,ఎస్‌యూసిఐ జిల్లా నాయకులు హరీష్‌లు వివిధ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు సీపీఐ, సీపీఎం, ఎస్‌యూసీఐ, ఎస్‌డీపీఐ పార్టీలతో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ ,ఏఐవైఎఫ్, డీఐవైఎఫఐ ,రాయలసీమ విద్యావంతుల వేదిక, తదితర ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామ పక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై చేస్తున్న యుద్ధం అమానుషమని, వందలాది అమాయకపు పసిపిల్లల ప్రాణాలను, ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్నారని విమర్శించారు.అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు ప్రపంచ మానవాళి శత్రువులని, వారి సొంత సామ్రాజ్య వాద, వ్యాపార ప్రయోజనాల కొరకే యుద్ధాలను చేస్తున్నారని విమర్శించారు. ఇవ్వాళ ప్రపంచ మొత్తం సంక్షోభంలో పడిపోయిందని, తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయాలని, ఇరాన్ లో సంరక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇరాన్ యుద్ధం పట్ల భారత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు వైఖరిని ఖండించారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి దేశ ప్రజలు ఇబ్బందులను పడుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. తీవ్రంగా నిరసించారు.యుద్ధం నిలిపి వేయాలని, శాంతి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నాయకులు జగన్నాథం, నగేష్,శ్రీనివాస రావు, చాంద్ బాషా, హరీష్ కుమార్ రెడ్డి, నాగన్న, జీ చంద్రశేఖర్, వెంకటేష్, మహేష్ ,శ్రీనివాసరావు ,బీసన్న మల్లన్న ,భారతి ,శ్రీనివాసులు ,నాగరాజు ,రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు రత్నం ఏసేపు, విజయ భాస్కర్ రెడ్డి, రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు