ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా సజావుగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఎంప్లాయిమెంట్, చిడాఫ్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించడం నిరుద్యోగులకు వరం లాగా మారిందని తెలిపారు. ఈ జాబ్ మేళాకి 10 కంపెనీల ప్రతినిధులు హాజరు కావడం జరిగిందని, సుమారు 112 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, అందులో 67 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపిక కాబడిన అభ్యర్థులందరికీ కూడా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాల జోషి, ప్లేస్మెంట్ అధికారి తేజ్ కుమార్ ఏపీ స్టేట్ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, ఎంప్లాయిమెంట్ అధికారి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో జాబ్ మేళా..
- Advertisement -
RELATED ARTICLES


