Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజిల్లాలో పారదర్శకంగా యూరియా పంపిణీకి చర్యలు

జిల్లాలో పారదర్శకంగా యూరియా పంపిణీకి చర్యలు

- Advertisement -

జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్

విశాలాంద్ర బ్యూరో- శ్రీ సత్యసాయి :- జిల్లాలో పారదర్శకంగా యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు యూరియా పంపిణీ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ యూరియా కొరత లేకుండా రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. యూరియా పంపిణీలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా సజావుగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎంత యూరియా ఉన్నది , వారానికి సరిపడా యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరాన్ని బట్టి యూరియా రెక్విరెమెంట్ ప్రతిపాదనలు చేయాలని అన్నారు. రైతులకు వ్యవసాయ అధికారులు యూరియా వినియోగం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్దంగా ముందస్తు ఏర్పాట్లతో యూరియా పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్, జిల్లా సహకార అధికారి కృష్ణా నాయక్, పరిశ్రమల శాఖ జిఎం నాగరాజు, మార్క్ఫెడ్ డి ఎం గీత, పశుసంవర్ధక శాఖ అధికారి సుబదాస్, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు