Homeజిల్లాలుఅనంతపురంపొంగిపొర్లిన వాగులు,వంకలు... నీట మునిగిన పంట పొలాలు

పొంగిపొర్లిన వాగులు,వంకలు… నీట మునిగిన పంట పొలాలు

- Advertisement -

విశాలాంధ్ర బొమ్మనహళ్.. మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున దంచి కొట్టిన వర్షానికి టమోటా, వేరుశనగ, పత్తి, పంటలు నీట మునిగాయి. కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలో27.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఏ ఎస్ ఓ పర్వతప్ప తెలిపారు.మండలంలో వివిధ గ్రామాలతో పాటు పై భాగాన వర్షాలు కురవడంతో ఉద్దేహళ్ వద్ద వేదవతి హగరి పొంగిపొర్లింది. బండూరు వంకకు బారి వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కో లగనహళ్లి వద్ద కబ్బాలి వంక కు భారీగా వరద నీరువచ్చాయి. దాదాపు 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగాయి.గోవిందవాడ గ్రామంలో ఇసుక దిబ్బలో సాగుచేసిన టమోటా, వేరుశనగ, పత్తి, పంటలు పూర్తిగా నీట మునిగాయి. పొలాల సమీపాన  వంక కు  భారీగా వరద నీరు రావడంతో ఆ నీరు పొలాల్లోకి వెళ్లి పంటలన్నీ నీట మునిగాయి. సుమారు వివిధ పంటలు సాగు చేసిన పంటలు నీటిపాలైంది. ప్రతి సంవత్సరం పంటల సాగు చేసి నష్టపోతున్నామని ఈసారి కూడా నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు