Monday, April 7, 2025
Homeతెలంగాణ10 రోజుల నుంచి పరారీలోనే కాకాణి… పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

10 రోజుల నుంచి పరారీలోనే కాకాణి… పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. గత 10 రోజుల నుంచి అడ్రెస్ లేకుండా పోయిన కాకాణి ఎక్కడున్నారనే విషయాన్ని కనిపెట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబైలలో కాకాణి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటీవల పోలీసు అధికారులను కూడా కాకాణి తీవ్ర స్థాయిలో దూషించారు. దీనిపై కూడా ఆయనపై కేసు నమోదయింది. క్వార్ట్జ్ కేసులో కాకాణికి పోలీసులు మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. మరోవైపు, ఈ కేసులో కాకాణి దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు