Homeఆంధ్రప్రదేశ్లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. కోర్టు ముందుకు నిందితులు

లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. కోర్టు ముందుకు నిందితులు

- Advertisement -

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులోనిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను‌ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. లిక్కర్‌ స్కాం కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం.అయితే, ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన వారిలో.. విజయవాడ జైలు నుంచి రాజ్‌ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్‌ నాయుడు, గుంటూరు జైలు నుంచి నిందితులు నవీన్, బాలాజీ కుమార్‌తో పాటు.. రాజమండ్రి జైలు నుంచి మిథున్‌రెడ్డిని కూడా ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. అయితే, బెయిల్‌పై పైలా దిలీప్‌, డిఫాల్ట్‌ బెయిల్‌పై ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప బయట ఉన్నారు. వీరు కూడా ఇవాళ (శుక్రవారం) న్యాయస్థానంలో జరిగిన విచారణకు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు