విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలసి యువత ఆత్మహత్య చేసుకుని మతి చెందిన స ంఘటన శనివారం వెలుగు చూసింది. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన రాజేశ్శరీ (35) 14 సంవత్సరాల క్రితం తెలంగాణా రాష్ట్రం అలంపూర్‌కు చెందిన రాజుతో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు . భర్త అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండే వాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం భర్త వేధింపులు భరించలేక తన పుట్టిల్లు అయిన గార్గేయపురం వచ్చింది. తల్లితండ్రులతో విషయం చెప్పి అక్కడే ఉన్న రాజేశ్వరీ శుక్రవారం తాను తిరిగి పోతున్నానని చెప్పి తన ఇద్దరు పిల్లలు అబ్రహం (3సం) సుకుమార్ (8సం) పిల్లలను తీసుకుని వచ్చి గ్రామ శివారులో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె పోన్ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారికోసం బంధూవులను , మిత్రులకు సమాచారం అందించిన ఫలితం లేకపోయింది. చివరకు శనివారం ఉదయం గార్గేయపురం చెరువు వద్ద చెప్పులు బట్టలు ఉండటంతో చెరువులో పరిశీలి ంచగా కుమార్తె, ఇద్దరు పిల్లల మత దేహాలు చెరువులో లభ్యం కావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మతదేహాలను వెలికి తీసి పోస్టుమర్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దీంతో గార్గేయపురంలో విషాదం చోటుచేసుకుంది.
కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలసి యువతి ఆత్మహత్య
- Advertisement -
RELATED ARTICLES


