వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు జస్టిస్ జేవీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఈ పిటిషన్ ను కేసు నెంబర్ 62గా సుప్రీంకోర్టు లిస్ట్ చేసింది. వైసీపీ హయాంలో భారీ ఎత్తున లిక్కర్ కుంభకోణం చోటుచేసుకుందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో, ఎఫ్ఐఆర్ లో తన పేరు లేకపోయినప్పటికీ ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు బెయిల్ ఎలా ఇస్తామని హైకోర్టు ప్రశ్నించింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
లిక్కర్ స్కామ్… సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్
RELATED ARTICLES