విశాలాంధ్ర, పెనుకొండ..వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం పెనుకొండలోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ లింగారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ వసంత పంచమి ప్రాధాన్యతను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. మనిషి జీవితంలో ఎదగడానికి జ్ఞానం, ధనం కీలక పాత్ర పోషిస్తాయని, జ్ఞానానికి ప్రతీక సరస్వతీ మాత, ధనానికి ప్రతీక లక్ష్మీదేవి పవిత్రమైన శుక్రవారం రోజున కలిసి రావడం విశేషమని తెలిపారు. అక్షరాభ్యాస కార్యక్రమం అనంతరం చిన్నారులకు పలకలు, బ్యాగులు, మిఠాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిద్ధార్థ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో అక్షరాభ్యాస వేడుకలు..
- Advertisement -
RELATED ARTICLES


