Homeజిల్లాలుఅనంతపురంఎస్‌బీఐ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం..

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం..

- Advertisement -

విశాలాంధ్ర, డీ హీరేహాళ్ ..డీ హీరేహాళ్ మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీ హీరేహాళ్ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్ జి. రాజేష్ నేతృత్వంలో స్థానిక హైస్కూల్ డీ హీరేహాళ్ మరియు హైస్కూల్ హెచ్. సిద్దాపురం లో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది డీ హీరేహాళ్ మండలంలోని 700 మందికి పైగా విద్యార్థినులకు sanitary napkins పంపిణీ చేసినట్లు మేనేజర్ రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు సేవలతో పాటు సమాజ హిత కార్యక్రమాలను కూడా నిరంతరం నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విజయభారతి, అమరవాణి విద్యార్థినులకు కిట్ల ఉపయోగాలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. హెచ్‌ఎంలు మున్ ఆఫ్, గౌరీ శంకర్ బ్యాంకు సేవలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు