Wednesday, February 18, 2026
Homeజిల్లాలుకర్నూలుమహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో జీఓ ప్రతులను భోగి మంటల్లో దగ్ధం నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, బికెఎంయు మండల కార్యదర్శి కుమ్మరి చంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నియంత పాలన చేస్తుందని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే శత వసంతాల వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, నాయకులు డోలు హనుమంతు, నాగరాజు, వీరేష్, చాకలి లక్ష్మన్న, సురేష్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు