Wednesday, February 18, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆల్ ఇండియా బాల్ బాడ్మింటన్ సౌత్ జోన్ హాకీ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు...

ఆల్ ఇండియా బాల్ బాడ్మింటన్ సౌత్ జోన్ హాకీ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక..

- Advertisement -

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : ఆల్ ఇండియా బాల్ బాడ్మింటన్, అలాగే సౌత్ జోన్ హాకీ పోటీలకు పట్టణంలోని కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా బాల్ బాడ్మింటన్ ,సౌత్ జోన్ హాకీ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చెందిన డి. లోకేష్( బి.కాం తృతియ ) బాల్ బాడ్మింటన్ ,
ఏ. బాల ఓబిలేసు (బి.ఏ ద్వితీయ ), బి. విశ్వనాధ్ ( బి.కాం తృతియ ),వై. పవన్ కుమార్ (బి.కాం ప్రథమ ), జి. ఆనంద్(బి.కాం ప్రథమ ) ఎంపికైనట్లు వారు తెలిపారు. కళాశాలలో చదువుతున్న వీరు డిసెంబర్ నెల 23 తేదీన ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక రావడం జరిగిందన్నారు. ఎంపికైన ఈ విద్యార్థులు చెన్నై లోని భారతి దాసన్ సత్యబామా యూనివర్సిటీ లో ఈ నెల(జనవరి) 14 వ తేదీ నుండి ప్రారంభమయ్యేటువంటి ఆల్ ఇండియా బాల్ బాడ్మింటన్ , సౌత్ జోన్ హాకీ పోటీలకు ఎస్కే యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఎంపికైన విద్యార్థులను డి లోకేష్, ఏ బాల ఓబిలేసుబి. విశ్వనాధ్, వై. పవన్ కుమార్ జి. ఆనంద్ లను కళాశాల ప్రిన్సిపల్ డా . కే ప్రభాకర్ రెడ్డి , కుమార్ , ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్, డా.బి గోపాల్ నాయక్ విద్యార్థులకు తదితర ఆద్యాపక ఆద్యాపకేతర సిబ్బంది అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు