Wednesday, February 18, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా సంక్రాంతి పండుగ వేడుకలు…

ఘనంగా సంక్రాంతి పండుగ వేడుకలు…

- Advertisement -

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి ప్రత్యేక ముగ్గుల పోటీలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి దంపతుల సమక్షంలో నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు జడ్జిలుగా ఉపాధ్యాయులు కరుణ, లత, వీరనారమ్మ వ్యవహరించి పర్యవేక్షణ వహించారు. ధర్మవరం పట్టణానికి చెందిన మొత్తం 115 మంది మహిళా పోటీదారులు ఈ ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు మాస్టర్‌తో కలిసి డాన్స్‌లు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు ప్రత్యేకంగా బుక్ , పెన్‌లను అందజేశారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలు ప్రధమ బహుమతి కే. పద్మావతి 10016/- ద్వితీయ బహుమతి కే. ప్రసన్నలక్ష్మి 5016/- తృతీయ బహుమతులు ఎస్. సాయి సుష్మ, సాయి కీర్తి 2016/- పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రత్యేక బహుమతి క్రింద హాట్ బాక్స్ లను దంపతుల చేతుల మీదుగా అందజేశారు. అనంతరం మహిళలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు