ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్.
విశాలాంధ్ర ధర్మవరం; ఫిబ్రవరి 17వ తేదీ నిర్వహించే వార్మింగ్ డే ను విజయవంతం చేయాలని ఏపీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం డివిజన్లోని ధర్మవరం రూరల్ అర్బన్ లోని రెసిడెన్షియల్ హాస్టల్ లను వారు సందర్శించారు. వార్మింగ్ డే పై సమీక్షను కూడా వారు నిర్వహించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఏరియా హెల్త్ స్టాప్ అందరు కూడా మీ యొక్క హాస్టల్స్ ను సందర్శించి ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇచ్చారా? అలాగే హాస్పిటల్ స్టాప్ టాబ్లెట్ ఎప్పుడు ఇచ్చారు? ఎలా మింగాలి? అన్ని విషయాలు మీకు చెప్పారా? రెసిడెన్షియల్ హాస్టల్ వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కేజీబీవీ స్కూల్ నందు పిల్లలకు నులిపురుగులు నివారణ కొరకు తెలిపే కార్యక్రమ వీడియోలు చూపించి అవగాహన కల్పించారు. ఆల్బెండజోల్ టాబ్లెట్ గురించి వాటి ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. ధర్మవరం రూరల్ పరిధిలో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను, లక్ష్మీ చెన్నకేశవపురంలోని యశోద స్కూల్ లను సందర్శించడం సందర్శించారు. అక్కడ ఉన్న రెండు అంగన్వాడి సెంటర్లను సందర్శించి, ఆల్బెండజోల్ ప్రోగ్రాం గురించి వివరించారు. సాయి నగర్ లోని బాల సదన్ హాస్టల్ ను, కొత్తపేటలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో
ధర్మవరం డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డి , రాజేష్ ,ధర్మరం అర్బన్ డాక్టర్లు, పన
మలేరియా అసిస్టెంట్ లు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్, ఏఎన్ఎంలు , ఆశ లు, అంగన్వాడి లు తదితరులు పాల్గొన్నారు.
వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..
- Advertisement -
RELATED ARTICLES


