Friday, March 6, 2026
Homeజిల్లాలుఅనంతపురంనులి పురుగులను నులిమేద్దాం

నులి పురుగులను నులిమేద్దాం

- Advertisement -

విశాలాంధ్ర -శెట్టూరు (అనంతపురం జిల్లా) : పిల్లలకు ఆల్బెండ జోల్ మాత్రలు వేయడం ద్వారా పేగుల్లోని పురు గులను నిర్మూలించి, రక్తహీనత, పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని డాక్టర్ లిఖిత అన్నారు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా శెట్టూరు జడ్పీ ఉన్నత పాఠశాల , కేజీబీవీ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు డాక్టర్ లిఖిత ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రవేట్ అంగనవాడి పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈసందర్భంగా డాక్టర్ లిఖిత మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 9వేల 774 మంది విద్యార్థులకు ఆల్బెండ జోల్ మాత్రులు వేయడం జరిగిందని అన్నారు 1- 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండ జోల్ మాత్రలు వేయడం ద్వారా పేగుల్లోని పురు గులను నిర్మూలించి, రక్తహీనత, పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని వారు తెలియజేశారు కార్యక్రమంలో సూపర్వైజర్ మునెమ్మ, కేజీబీవీ ప్రిన్సిపల్ లలితమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మౌనిక, ఇంద్రజ లిఖిత, ఏఎన్ఎమ్స్, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్స్ విద్యార్థులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు