Homeజిల్లాలుఅనంతపురంగ్రానైట్ బండలు మీద పడి వ్యక్తి తీవ్ర గాయాలు..

గ్రానైట్ బండలు మీద పడి వ్యక్తి తీవ్ర గాయాలు..

- Advertisement -

విశాలాంధ్ర కనేకల్,.. కనేకల్ పట్టణంలో గ్రానైట్ బండల లోడు దించుతుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ బండ మీద పడి సలాం అనే వ్యక్తికి రెండు కాళ్లకు,ఎడమ చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన సలాం ను హుటి హుటినా కనేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కాగా పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం అనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతున్నారు.కూలీ పనులు చేసుకునే సలాం నూరని మజీద్ లో కూడా చిన్న మవుజన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే సలాం కు ఇలా జరగడం బాధాకరమని గ్రామస్తులు,బంధువులు తెలిపారు.కూలి పనులు చేసుకుంటూ గాయపడిన సలాం కు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని బంధువులు కోరారు. ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 9966504379,9985584500 నెంబర్లకు ఫోన్ పే ద్యారా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని బంధువులు వేడుకున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు