Homeజిల్లాలుకర్నూలుఅథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మండల విద్యార్థులు

అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మండల విద్యార్థులు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలకు పెద్దకడబూరు మండల విద్యార్థులు ఎంపికయ్యారు. మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన బంగి హర్షవర్ధన్, పెద్దకడబూరు గ్రామానికి చెందిన నల్లమల అంబేద్కర్ లు సత్యసాయి జిల్లా కొడిగెనహళ్లి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఆరు కిలోమీటర్ల పరుగు పందెంలో బంగి హర్షవర్ధన్ మొదటి స్థానంలో, నల్లమల అంబేద్కర్ ఐదో స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పెద్దకడబూరు మండలం విద్యార్థులు అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు