విశాలాంధ్ర..రాజాం ( విజయనగరం జిల్లా) : అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తోంది. రాజాం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గతంలో అనధికార మద్యం విక్రయాలు (బెల్ట్ షాపులు) నిర్వహిస్తూ పట్టుబడిన ఎనిమిది మంది పాతనేరస్థులను బిఎన్ఎస్ఎస్ చట్టం–2023 లోని సెక్షన్ 129 కింద, అలాగే 22 మంది అనుమానితులను సెక్షన్ 128 కింద ఈరోజు రాజాం మండల తహసిల్దార్ మరియు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రాజశేఖర్ సమక్షంలో హాజరుపరిచి బైండోవర్ చేశారు.ఈ బైండోవర్ ప్రక్రియలో, నిందితులందరికీ ఒక్కొక్కరిపై ఒక లక్ష రూపాయల పూచీకత్తుతో ఒక సంవత్సరం కాలపరిమితికి బైండోవర్ చేయడమైంది.
ఈ సందర్భంగా రాజాం ఎక్సైజ్ సీఐ ఆర్. జైభీమ్ మాట్లాడుతూ —
“బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టరీత్యా నేరం. ఇప్పటివరకు మా స్టేషన్ పరిధిలో మొత్తం 139 మందిని బైండోవర్ చేశాము. అయినప్పటికీ ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తే భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటాము” అని హెచ్చరించారు.
బెల్ట్ షాపులపై కఠిన చర్యలు – 30 మందిపై బైండ్ ఓవర్ కేసులు
- Advertisement -


