-పనులు పూర్తి చేసి మరో 20రోజుల్లో బ్రిడ్జిపై రాకపోకలు
-ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర-రాప్తాడు : పొద్దున నిద్రలేస్తే ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి నిత్యం తమను విమర్శించే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అసంపూర్తిగా ఉన్న రైల్వే బ్రిడ్జిని గత ఐదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేకపోయారో చెప్పాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నిలదీశారు. గత 8ఏళ్లుగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారిన రాప్తాడు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల పురోగతిపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు, టిడిపి నాయకులతో కలిసి ఆరా తీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2017లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.74కోట్లు మంజూరయ్యాయని, అయితే గత కాంట్రాక్టర్ రూ.49 కోట్ల వరకు పనులు చేసి ఆ తర్వాత ఆలస్యం చేశారన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో దీని గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రకాష్ రెడ్డికి ప్రజల సొమ్ము దోచుకునే దానిపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలు పరిష్కరించడంపై లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నతస్థాయిలో చర్చించి తిరిగి పనులు ప్రారంభించామన్నారు. 2026 మే నెలలోపు ఈ పనులు పూర్తవుతాయని, అయితే మరో 20 రోజుల్లో ఈ బ్రిడ్జి మీదుగా రాకపోకలు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మండల ఇంఛార్జి ధర్మవరపు మురళీ, కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శీనా, మరూరు సొసైటీ అధ్యక్షుడు గోపాల్, సీనియర్ నాయకులు సాకే నారాయణస్వామి, ఎర్రగుంట నారాయణస్వామి, కురుబ సాధికారత రాష్ట్ర కన్వీనర్ గంగలకుంట రమణ, కిష్ట, ఉపాధ్యక్షుడు జూటూరు రామకృష్ణ,పంపు ఇంద్ర, తెలుగు యువత రాజశేఖర్ రెడ్డి, సోమర నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


