- Advertisement -
విశాలాంధ్ర – కొవ్వూరు :ఉద్యోగ బాధ్యతలలో అత్యంత ప్రతిభ కనబరిచిన కొవ్వూరు టౌన్ ప్లానింగ్ అధికారి మణిరామ్ కు ఉత్తమ అధికారిగా అవార్డు లభించింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా రాష్ట్ర మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా ఈయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మణిరామ్ ను మున్సిపల్ కమిషనర్ , తదితర అధికారులు సిబ్బంది అభినందించారు


