Homeజిల్లాలుఅనంతపురంవివాహిత ఆత్మహత్య..

వివాహిత ఆత్మహత్య..

- Advertisement -

విశాలాంధ్ర శింగనమల.. మండల పరిధిలోని పడమటి నరసాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (38)శుక్రవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. దివ్యాంగురాలైన లక్ష్మీదేవి గత కొన్నిసంవత్సరాలుగా వెన్నునొప్పి తో బాధ పడుతున్నదని, వైద్యులకు చూపించిన నయం కాలేదని బంధువులు తెలిపారు. శుక్రవారం వెన్నునొప్పి అధికం కావడంతో భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉదయం పురుగుల మందు సేవించిందన్నారు. అదే సమయానికి ఇంటికి వచ్చిన భర్త చూసి ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మీదేవి మృతి చెందిందన్నారు. లక్ష్మీదేవి కి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇంచార్జ్ ఎస్ఐ గోవిందు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు