తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా చీటీలు రాస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ధరణి బాబు తెలిపారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు.జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పర్యవేక్షణలో, సీఐ శివగంగాధర్ రెడ్డి సమక్షంలో అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మండల పరిధిలోని పుట్లూరు రోడ్డులో ఉన్న ఆర్డిటి కాలనీకి చెందిన షేక్ షెక్షావలి కుమారుడు షేక్ చాంద్ బాష (32) తాడిపత్రి పట్టణం పాతకోట ప్రాంతంలో డోర్ నెంబర్ 4/300 వద్ద మట్కా చీటీలు రాస్తున్నాడన్న సమాచారంతో దాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు.రూరల్ ఎస్సై ధరణి బాబు సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి రూ.12,410 నగదు, మట్కా నంబర్లు రాసిన రెండు చీటీలు, ఒక బాల్ పెన్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మట్కా, జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో ఎస్సై కాటమయ్య పాల్గొన్నారు.


