విశాలాంధ్ర – హిందూపురం :హిందూపురం పట్టణంలోని గుడ్డం శ్రీ రంగనాథ స్వామి ఆలయం ప్రాంగణంలో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ డీఈ. రమేష్ కుమార్, రాజ్యలక్ష్మి, మోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.సంబరాల్లో భాగంగా నిర్వహించిన కోలాట ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే సంక్రాంతి పండుగ ప్రత్యేకతను ప్రతిబింబించే సాంప్రదాయ నృత్యాలు, పిండివంటల కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.ఈ వేడుకలను తిలకించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేలా జరిగిన ఈ కార్యక్రమాలు సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
గుడ్డం శ్రీ రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు
- Advertisement -
RELATED ARTICLES


