విశాలాంధ్ర-తాడిపత్రి: రబీలో సాగుచేసిన పంటలకు పంట నమోదు వేగవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.రవి పేర్కొన్నారు. మంగళవారం పుట్లూరు మండలం అరకటివేముల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి కాత్యాయని ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి ఎం. రవి పాల్గొన్నారు. మొదటగా గ్రామ పొలాలలో సాగుచేసిన రబీ పంటలకు సంబంధించిన ఈ-పంట నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంట వేయకూడదన్నారు. ప్రకృతి వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. అలాగే రబీలో సాగు చేసిన పంటలన్నీ పంట నమోదు వేగవంతం చేయాలని తెలియజేశారు. పప్పు శనగ పంట నమోదును త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఏఓ. రాఖేష్ నాయక్, ఏఈఓ చిన్ననాగిరెడ్డి, ఎంపీఈఓ సుమతి, రైతులు పాల్గొన్నారు.


