Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఅనంతపురంఅక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు

అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు

- Advertisement -

విశాలాంధ్ర….డీ హి రే హల్ ..మండల ప్రజలు సంక్రాంతి పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని సీఐ వెంకటరమణ ఆదేశాల మేరకు ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి సూచించారు. పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే వారు తమ విలువైన వస్తువులను బ్యాంకుల్లో లేదా నమ్మకమైన వ్యక్తుల ఇళ్లలో భద్రపరచుకోవాలని ఆయన తెలిపారు. ఒకవేళ ఇంట్లోనే ఉంచినట్లయితే పక్కింటివారు లేదా బంధువులు ఇంటిని గమనిస్తూ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.మండల పరిధిలో ఎక్కడైనా పేకాటలు, కోళ్ల పందేలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఇటువంటి ఘటనలపై సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి శాంతియుతంగా, భద్రతతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు