రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
విశాలాంధ్ర – తిరువూరు : రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి మంగళవారం మండలంలోని పెద్దవరం, ముస్తికుంట్ల గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు.యూరియా పంపిణీపై రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి అనే సమాచారం మేరకు ఆర్డీవో నేరుగా గ్రామాలకు వెళ్లి పంపిణీ వ్యవస్థను పరిశీలించారు.పంపిణీ కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆర్డీవో రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు,రైతులు లైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి వస్తోందనే విషయం ఆమె దృష్టికి తీసుకురా గానే,వెంటనే సిబ్బందిని ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాధురి మాట్లాడుతూ రైతులు వేచి ఉండే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరికీ టోకెన్లు జారీ చేసి, కూర్చునే విధంగా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సొసైటీ సిబ్బంది సమయానికి రాకపోవడం,స్టాక్ వివరాలు స్పష్టంగా వెల్లడిరచకపోవడం పట్ల ఆర్డీవో అసంతృప్తి వ్యక్తం చేశారు.సిబ్బంది ఆలస్యంగా రావడం సహించబో మని హెచ్చరిస్తూ,విధుల్లో శ్రద్ధగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు.రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా పంపిణీ జరగాలని ఆమె ఆదేశించారు. యూరియా సరఫరా, నిల్వ, పంపిణీ రికార్డులను కూడా ఆర్డీవో పరిశీలించారు. స్టాక్ వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని, పంపిణీ అనంతరం లబ్ధిదారుల వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని ఆమె సిబ్బందికి సూచించా రు.రైతు సేవా కేంద్రాలు ప్రజాసేవ కోసం ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకొని పనిచేయాలని ఆర్డీవో చెప్పారు.రైతులు కూడా తమ సమస్యలను ఆర్డీవోకు వివరించారు.ముఖ్యంగా టోకెన్లు సమయానికి ఇవ్వకపో వడం,ఎక్కువసేపు నిలబెట్టడం, సమాచార లోపం వంటి అంశాలపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆర్డీవో తక్షణ చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.తనిఖీల్లో తిరువూరు తహసీల్దార్ వై. నాగమణి, తిరువూరు సబ్ ఇన్‌స్పెక్టర్ శాతకర్ణి పాల్గొన్నారు. యూరియా పంపిణీ మరింత క్రమబద్ధంగా,వ్యవస్థీకృతం గా జరిగేలా కేంద్ర సిబ్బందికి అవసరమైన మార్గదర్శకాల ను అధికారులు అందజేశారు.రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, రాబోయే రోజుల్లో పంపిణీ పద్ధతిని మరింత మెరుగుపరుస్తామని ఆర్డీవో మాధురి తెలిపారు.
యూరియా పంపిణీపై ఆర్డీవో మాధురి ఆకస్మిక తనిఖీలు
- Advertisement -
RELATED ARTICLES


